భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై ఐదవ శ్లోకము

త్రైగుణ్యవిషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||

త్రైగుణ్య = ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన
విషయాః = విషయమునే
వేదాః = వేదములు
నిస్త్రైగుణ్యః = మూడుగుణములకు అతీతుడవు
భవ = అగుము
అర్జున = ఓ అర్జునా
నిర్ద్వన్ద్వః = ద్వంద్వములు లేకుండా
నిత్యసత్త్వస్థః = శుద్ధ ఆధ్యాత్మికస్థితిని
నిర్యోగక్షేమః = యోగ, క్షేమముల ఆలోచన నుండి విడివిడి
ఆత్మవాన్ = ఆత్మ యందు స్థిరుడవు

తాత్పర్యం :-

ఓ అర్జునా! వేదములు ప్రధానముగా సత్వ రాజ స్తమములను ప్రకృతి గుణముల గూర్చి తెలుపును. నీవు ఈ మూడు గుణములకునూ అతీతుడవు కమ్ము. సుఖదుఃఖాది ద్వందములను లాభ క్షేమములను గూర్చి కుతూహము లేనివాడివి ఆత్మ నిష్టుడవు కమ్ము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top