భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై రెండవ శ్లోకము

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే ||

ధ్యాయతః = ధ్యానించునపుడు
విషయాన్ = ఇంద్రియార్థములను గూర్చి
పుంసః = వ్యక్తికి
సఙ్గాత్ = ఆసక్తి నుండి
సంజాయతే = పుట్టును
కామః = కోరిక
కామాత్ = కోరిక వలన
క్రోదః = కోపము
అభిజాయతే = వ్యక్తమగును

తాత్పర్యం :-

ఇంద్రియార్ధములను గురించి ఆలోచించునపుడు మానవునికి వానిపై ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి కోపము ఉప్పతిల్లును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top