భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై ఏడవ శ్లోకము

యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

యః = ఎవడు
సర్వత్ర = ఎల్లెడల
అనభిస్నేహః = అనురాగము లేనివాడై
తత్ తత్ = దానిని దానిని
ప్రాప్య = పొంది
శుభాశుభమ్ = మంచిని, చెడును
న అభినన్దతి = ప్రశంసింపడు
న ద్వేష్టి = ద్వేషింపడు
తస్య = అతని యొక్క
ప్రజ్ఞా = సంపూర్ణజ్ఞానము
ప్రతిష్ఠితా = స్థిరమై యుండును

తాత్పర్యం :-

ఈ భౌతిక ప్రపంచమున తానేట్టి మంచిని కాని, చెడ్డను కాని పొందిననూ దానిని ప్రసంసించుట కాని, ద్వేషించుట కాని చేయక ఎట్టి కలతను పొందక ఉండువాడు సమగ్రమైన జ్ఞానమందు సుస్థిరుడై ఉండును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top