భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై నాలుగవ శ్లోకము

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||

రాగ = ఆసక్తి
ద్వేష = ద్వేషము
విముక్తైః = విముక్తుడైనవాడు
తు = కాని
విషయాన్ = ఇంద్రియార్థములను
ఇన్ద్రియైః = ఇంద్రియములచే
చరన్ = అనుభవించుచున్నను
ఆత్మవశ్యైః = తనకు వశములైన
విధేయాత్మా = నియమముతో వర్తించువాడు
ప్రసాదమ్ = భగవంతుని అనుగ్రహమును
అధిగచ్ఛతి = పొందును

తాత్పర్యం :-

కానీ రాగద్వేషమును జయించినవాడు నియమ నిబంధనల ద్వారా ఇంద్రియములను నిగ్రహించిన వాడు ఇంద్రియ విషయముల మధ్య చలించుచున్ననూ భగవంతుని సంపూర్ణ అనుగ్రహము పొందజాలును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top