భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదిహేడవ శ్లోకము

అవినాశి తు తద్విద్ది యేన సర్వమిదం తతమ్ |
వినాశమ్ అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి ||

అవినాశి = నాశము లేనట్టిది
తు = కాని
తత్ = దానిని
విద్ధి = తెలిసికొనుము
యేన = దేనిచే
సర్వమిదం = ఈ శరీరమంతయు
తతమ్ = వ్యాప్తమై యున్నదో
వినాశం = నాశమును
అవ్యయస్య అస్య = ఈ నాశనము లేనిదానికి
కశ్చిత్ = ఎవ్వడును
కర్తుం = చేయుటకు
న అర్హతి = సమర్ధుడు కాడు

తాత్పర్యం :-

శరీరమందంతటనూ వ్యాపించి ఉన్న ఆత్మ నాశము లేనిదని నీవు గ్రహింపవలయును. వినశ్వరమైన ఆత్మను ఎవ్వరునూ నశింపచేయజాలరు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top