భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై రెండవ శ్లోకము

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారామ్ అపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృషమ్ ||

యాదృచ్ఛయా = తనంతతాను
చ = కూడా
ఉపపన్నం = పొందబడిన
స్వర్గద్వారం = స్వర్గద్వారము
అపావృతం = తెరువబడినటువంటి
సుఖినః = సౌఖ్యవంతులైన
క్షత్రియాః = క్షత్రియులు
పార్థ = ఓ కుంతీపుత్రా
లభన్తే = పొందునటువంటి
యుద్ధం = యుద్దమును
ఈదృశమ్ = ఇటువంటి

తాత్పర్యం :-

ఓ పార్థా! ఏ క్షత్రియులకు స్వర్గద్వారములు తెరచు ఇట్టి యుద్ధావకాశములు అప్రయత్నముగా లభించునో అట్టి వారు సౌక్యమంతులు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top