భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - మూడవ శ్లోకము

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయి ఉపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప ||

క్లైబ్యం = నపుంసకత్వము
మా స్మ గమః = పొందుకుము
పార్థ = ఓ పృథాకుమారా
ఏతత్ = ఇది
త్వయి = నీకు
న ఉపపద్యతే = తగినది కాదు
క్షుద్రం = తుచ్ఛమైన
హృదయదౌర్బల్యం = హృదయబలహీనతను
త్యక్త్వా = విడిచి
ఉత్తిష్ఠ = లెమ్ము
పరన్తప = శత్రువులను తపింపజేయువాడా

తాత్పర్యం :-

ఓ పార్థ! నీచమైన ఈ నపుంసకత్వమునకు లోబడకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప తుచ్యమైన ఈ హృదయ దౌర్బల్యమును విడిచి లెమ్ము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top