భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై ఏడవ శ్లోకము

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసేమహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ||

హతః వా = చంపబడి
ప్రాప్స్యసి = పొందగలవు
స్వర్గం = స్వర్గమును
జిత్వా వా = జయించి
భోక్ష్యసే = అనుభవింతువు
మహీమ్ = భూమిని
తస్మాత్ = అందుచే
ఉత్తిష్ఠ = లెమ్ము
కౌన్తేయ = ఓ కుంతీపుత్రా
యుద్ధాయ = యుద్ధము కొరకు
కృతనిశ్చయః = నిశ్చయించినవాడవై

తాత్పర్యం :-

ఓ కౌంతేయ! నీవు యుద్ధమున చంపబడినచో స్వర్గలోకమును పొందగలవు. జయించినచో భూలోక రాజ్యమును అనుభవింతువు. అందుచే నిశ్చయ బుద్ధితో లేచి యుద్ధమును చేయుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top