భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - రెండవ శ్లోకము

శ్రీభగవానువాచ
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ||

శ్రీభగవానువాచ = శ్రీకృష్ణభగవానుడు పలికెను
కుతః = ఎచ్చట నుండి
త్వా = నీకు
కశ్మలమ్ = ఈ కల్మషము
ఇదమ్ = ఈ వ్యాకులత
విషమే = ఈ క్లిష్టసమయము నందు
సముపస్థితమ్ = వచ్చినది
అనార్య = జీవితము యొక్క విలువ తెలియనివారు
జుష్టం = ఆచరింపబడునది
అస్వర్గ్యం = ఉన్నతలోకములను లభింపజేయనట్టి
అకీర్తికరమ్ = అపకీర్తిని కలిగించునట్టి
అర్జున = ఓ అర్జునా!

తాత్పర్యం :-

దేవాతిదేవుడైన కృష్ణభగవానుడు పలికెను - ఓ ప్రియమైన అర్జునా ఈ క్లిష్ట సమయమునందు ఇట్టికాలస్యము నీకు ఎక్కడనుండి దాపరించినది. ఇది జీవితము యొక్క విలువను తెలిసిన మానవునకు అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారితీయదు సరి కదా అపకీర్తిని కలిగించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top