భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబైవ శ్లోకము

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||

బుద్ధియుక్తః = భక్తియుక్తసేవలో నియుక్తుడైనవాడు
జహాతి = విడువజాలును
ఇహ = ఈ జన్మమందే
ఉభే = రెండింటిని
సుకృతదుష్కృతే = మంచిచెడుఫలితములను
తస్మాత్ = అందుచే
యోగాయ = భక్తియోగము కొరకు
యుజ్యస్వ = నియుక్తుడవగుము
యోగః = కృష్ణపరములైన
కర్మసు = పనుల యందు
కౌశలమ్ = నేర్పు

తాత్పర్యం :-

భక్తియుక్తమైన సేవలోనిమగ్నుడై ఉన్నవాడు ఈ జీవితమునందు సుకృత దుష్కృత ఫలములనుండి విముక్తుడగును. అందుచే యోగము కొరకు యత్నింపుము. యోగమనగా కర్మయందలి నేర్పు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top