భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై నాలుగవ శ్లోకము

అర్జున ఉవాచ
స్థితిప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ||

అర్జునః ఉవాచ = అర్జునుడు పలికెను
స్థితఃప్రజ్ఞస్య = కృష్ణభక్తిరసభావన యందు స్థిరుడైనవాని యొక్క
కా = ఎట్టిది
భాషా = భాష
సమాధిస్థస్య = సమాధి యందున్నవానికి
కేశవ = ఓ కృష్ణా
స్థిత ధీః = కృష్ణభక్తిభావన యందు స్థిరముగా నున్నవాడు
కిం = ఏది
ప్రభాషేత = పలుకును
కిం = ఎట్లు
ఆసీత = ఉండును
వ్రజేత = నడుచును
కిం = ఎట్లు

తాత్పర్యం :-

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! సమాధిలో మగ్నమైన చైతన్యము గల స్థితప్రజ్ఞుని యొక్క గుర్తులెట్టివి. అతడెట్లు పలుకును. అతని భాష ఎట్టిది. అతడెట్లు కూర్చుండును. ఎట్లు నడుచును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top