భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఏడవ శ్లోకము

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||

కార్పణ్య = లోభము
దోష = బలహీనతచే
ఉపహత = పీడింపబడి
స్వభావః = స్వభావము
పృచ్ఛామి = అడుగుచున్నాము
త్వాం = నిన్ను
ధర్మసమ్మూఢ = ధర్మమునందు మోహము చెందిన
చేతాః = హృదయమున
యత్ = ఏది
శ్రేయః = సర్వహితకరము
స్యాత్ = అగునో
నిశ్చితం = నిశ్చయముగా
బ్రూహి = తెలుపుము
తత్ = అది
మే = నాకు
శిష్యః = శిష్యుడను
తే = నీకు
అహం = నేను
శాధి = ఉపదేశింపుము
మాం = నేను
త్వాం = నీకు
ప్రపన్నమ్ = శరణాగతుడను

తాత్పర్యం :-

నాయందలి కార్పన్న్య దోషముచే నేను నా ధర్మం విషయమున కలతనొంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో నాకేమి మిక్కిలి హితకరమో అది నిక్షయముగా తెలుపుమని నిన్నడుగుచున్నాను. నేనిప్పుడు నీ శరణు పొందిన శిష్యుడను దయచేసి నాకు భోదింపుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top