భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై నాలుగవ శ్లోకము

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||

భోగైశ్వర్య = భౌతికభోగానుభవముల యందును, సంపదల యందును
ప్రసక్తానాం = ఆసక్తులైనవారికి
తయా = వాని చేత
అపహృత చేతసామ్ = మోహగ్రస్థమైన మనస్సులు కలవారికి
వ్యవసాయాత్మికా = నిశ్చయముతో కూడిన
బుద్ధిః = భగవానుని భక్తియుక్తసేవ
సమాధౌ = నియమితమైన మనస్సునందు
న విధీయతే = కలుగదు

తాత్పర్యం :-

భోగానుభవమునందునూ, లౌకిక సంపదలందునూ ఆసక్తులై ఉండు వాని అట్టి వానిచే ఆకర్శింపబడువారి చిత్తములందు దేవతిదేవుని భక్తియుక్త సేవకొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top