భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - తొమ్మిదవ శ్లోకము

సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషీకేశం గూడాకేశః పరన్తపః |
న యోత్స్యే ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవహ ||

సంజయః ఉవాచ = సంజయుడు పలికెను
ఏవం = ఆ విధముగా
ఉక్త్వా = పలికి
హృషీకేశం = ఇంద్రియములకు ప్రభువైన కృష్ణునితో
గుడాకేశః = అజ్ఞానమును అంతరింపజేయుట యందు నిపుణుడైన అర్జునుడు
పరన్తపః = శత్రువులను జయించువాడు
న యోత్స్యే = నేను యుద్ధము చేయను
ఇతి = అని
గోవిన్దం = ఇంద్రియములకు ఆనందము నొసగు కృష్ణునితో
ఉక్త్వా = పలికి
తూష్ణీం బభూవ = మౌనము వహించెను
హ = నిశ్చయముగా

తాత్పర్యం :-

సంజయుడు పలికెను - ఈ విధముగా పలికి శత్రువులను ఓడించు అర్జునుడు కృష్ణునికి, గోవిందా నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనం వహించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top