భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవయవ శ్లోకము

న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||

న జాయతే = జన్మింపదు
మ్రియతే వా = మరణింపదు కూడా
కదాచిత్ = ఎప్పుడును
న = కాదు
అయం = ఇది
భూత్వా = జన్మించి
భవితా = జన్మించుచు
వా = లేక
న = లేదు
భూయః = తిరిగి జన్మించుట
అజః = పుట్టుకలేనిది
నిత్యః = నిత్యమైనది
శాశ్వతః = శాశ్వతమైనది
అయం = ఇది
పురాణః = ప్రాచీనమైనది
న హన్యతే = చంపబడదు
హన్యమానే = చంపబడినను
శరీరే = దేహము

తాత్పర్యం :-

అత్మకెప్పుడునూ జననము కాని మరణము కాని లేదు. ఆత్మ ఒకప్పుడుండి మరియొకప్పుడు లేకపోదు. అది అజము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడిననూ అది చంపబడదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top