భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - డెబ్బై రెండవ శ్లోకము

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ||

ఏషా = ఇది
బ్రాహ్మీస్థితిః = ఆధ్యాత్మికస్థితి
పార్థ = ఓ కుంతీనందనా
ఏనాం = దీనిని
ప్రాప్య = పొంది
న విముహ్యతి = కలతనొందడు
స్థిత్వా = స్థితినొంది
అస్యాం = ఈ స్థితియందు
అన్తకాలేపి = జీవితాంతమున కూడా
బ్రహ్మనిర్వాణం = దేవదేవుని ఆధ్యాత్మికరాజ్యమును
ఋచ్ఛతి = పొందును

తాత్పర్యం :-

ఓ పార్థా! ఇదియే ఆధ్యాత్మికమునూ, దివ్యమునూనయిన జీవితము యొక్క పధ్ధతి. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనొందడు. మరణకాలమందైననూ అతనట్లున్నచో వైకుంటము ప్రవేసింపజాలును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top