భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పంతొమ్మిదవ శ్లోకము

య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ||

యః = ఎవరైతే
ఏనం = దీనిని
వేత్తి = భావించునో
హన్తారం = చంపువానిగా
యః = మరియెవాడు
చ = కూడా
ఏనం = దీనిని
మన్యతే = తలంచునో
హతం = చంపబడువానిగా
ఉభౌ తౌ = ఆ ఇరువురును
న విజానీత = జ్ఞానరహితులు
అయం = ఇది
న హన్తి = చంపదు
న హన్యతే = చంపబడదు

తాత్పర్యం :-

జీవుడు చంపువాడని తలంచువాడును, చంపబడునని తలంచువాడును ఇరువురునూ అజ్ఞానులే. ఏల యన ఆత్మ చంపదు, చంపబడదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top