భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై ఎనిమిదవ శ్లోకము

తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

తస్మాత్ = అందుచే
యస్య = ఎవని
మహాబాహో = పరాక్రమము గల బాహువులు గలవాడా
నిగృహీతాని = నిగ్రహింపబడినవో
సర్వశః = అన్నింటినుండి
ఇన్ద్రియాణి = ఇంద్రియములు
ఇన్ద్రియార్థేభ్యః = ఇంద్రియవిషయముల నుండి
తస్య = అతని
ప్రజ్ఞా = బుద్ధి
ప్రతిష్ఠితా = స్థిరమైనది

తాత్పర్యం :-

అందుచే బలమైన బాహువులుకలవాడా ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడిన సకల ఇంద్రియములు కలవాడు తప్పక స్థితప్రజ్ఞుడగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top