భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - డెబ్బైవ శ్లోకము

ఆపూర్వమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ||

ఆపూర్యమాణం = ఎల్లప్పుడును పూరింపబడునది
అచలప్రతిష్ఠం = స్థిరముగా నుండునది
సముద్రం = సముద్రమును
ఆపః = జలములు
ప్రవిశన్తి యద్వత్ = ఎట్లు ప్రవేశించుచుండునో
తద్వత్ = అట్లు
కామాః = కోరికలు
యమ్ = ఎవనియందు
ప్రవిశన్తి = ప్రవేశించునో
సర్వే = అన్నియును
సః = అతడు
శాన్తిమ్ = శాంతిని
ఆప్నోతి = పొందును
న = పొందజాలడు
కామకామీ = కోరికలను ఈడేర్చుకొనగోరువాడు

తాత్పర్యం :-

నదులు సర్వదా నీటిని పూరించుచున్ననూ సుస్థిరమైయండు సముద్రమువలే అవిచిన్నమైన కోరికల ప్రవాహముచే కలతనొందని మానవుడు మాత్రమే శాంతిని పొందజాలును. తన కోరికలను తృప్తి పొందింప యత్నించు వారెల్లపుడునూ శాంతిని పొందజాలరు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top