భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై ఎనిమిదవ శ్లోకము

యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనంజయ |
సిద్ద్యసిద్ద్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||

యోగస్థః = సమభావము కలవాడవై
కురు = చేయుము
కర్మాణి = నీ ధర్మములను
సఙ్గం = ఆసక్తిని
త్యక్త్వా = విడిచి
ధనంజయ = ఓ అర్జునా
సిద్ద్యసిద్ధ్యోః = జయాపజయములందు
సమః = సమభావము కలవాడవు
భూత్వా = అయి
సమత్వం = సమభావమే
యోగః = యోగమని
ఉచ్యతే = చెప్పబడుచున్నది

తాత్పర్యం :-

ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తి లేకుండ నీవు సమ భావముతో స్వధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top