భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై ఆరవ శ్లోకము

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ||

న ఆస్తి = ఉండజాలదు
బుద్ధిః = విశుద్ధబుద్ధి
అయుక్తస్య = కృష్ణభక్తిభావన లేనివానికి
భావనా = స్థిరమైన బుద్ధి
న చ = ఉండదు
ఆయుక్తస్య = కృష్ణభక్తిభావన లేనివానికి
అభావయతః = స్థిరమైన బుద్ధిలేనివానికి
శాన్తిః = శాంతి
న చ = ఉండదు
అశాన్తస్య = శాంతిలేనివానికి
కుతః = ఎక్కడిది
సుఖమ్ = సుఖము

తాత్పర్యం :-

భగవంతునితో సంబందము కలిగి ఉండని వానికి విశుద్ధ బుద్ధి కాని, స్థిరమైన మనస్సు కాని ఉండజాలవు. అవి లేనిచో శాంతికి అవకాశము లేదు. శాంతి లేనిచో సుఖము ఎట్లు కలుగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top