భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై మూడవ శ్లోకము

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||

శ్రుతి = వేదములందు చెప్పబడిన
విప్రతిపన్నా = కామ్యకర్మలచే ప్రభావితము కానిదై
తే = నీ యొక్క
యదా = ఎప్పుడు
స్థాస్యతి = ఉండునో
నిశ్చలా = చంచలము కానిదై
సమాధౌ = సమాధియందు లేక కృష్ణభక్తిభావన యందు
అచలా = స్థిరమైనది
బుద్ధిః = బుద్ధి
తదా = అప్పుడు
యోగం = ఆత్మానుభూతిని
అవాప్స్యసి = పొందగలవు

తాత్పర్యం :-

నీ బుద్ధి ఎప్పుడు వేదములందలి మృదుమధురమైన భాషచే కలతనొందకుండా ఆత్మానుభూతి అను సమాది యందు స్థిరమై ఉండజాలును. అప్పుడు నీవు దివ్యచైతన్యమును పొందజాలుదువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top