భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలుబదియవ శ్లోకము

నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||

ఇహ = ఈ యోగమునందు
అభిక్రమనాశః = ప్రయత్నము నందు నాశము
న అస్తి = లేదు
ప్రత్యవాయః = హాని
న విద్యతే = ఉండదు
స్వల్పం అపి = మిక్కిలి స్వల్పమైనను
అస్య = ఈ
ధర్మస్య = ధర్మము
త్రాయతే = రక్షించును
మహతః = గొప్ప
భయాత్ = భయము నుండి

తాత్పర్యం :-

ఈ ప్రయత్నము నందు నష్టము కాని, హాని కానీ లేదు. ఈ మార్గమున స్వల్పమైన ప్రయత్నము చేసిననూ అది మానవుని మిక్కిలి ప్రమాదకరమైన భయము నుండి కూడా రక్షించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top