భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై నాలుగవ శ్లోకము

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ||

అకీర్తిం = అపకీర్తిని
చ = కూడా
అపి = పైగా
భూతాని = ప్రజలందరును
కథయిష్యన్తి = చెప్పుదురు
తే = నీ యొక్క
అవ్యయామ్ = ఎల్లప్పుడు
సంభావితస్య చ = గౌరవము కలవానికి
అకీర్తిః = అపకీర్తి
మరణాత్ = మరణము కంటె
అతిరిచ్యతే = దారుణమైనది

తాత్పర్యం :-

ప్రజలెప్పుడునూ నీ అపకీర్తి గూర్చి చెప్పుకుందురు. గౌరవము కలవానికి అపకీర్తి మరణము కంటే కూడా దారుణమైనది.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top