భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదవ శ్లోకము

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః ||

తం = ఆతనితో
ఉవాచ = పలికెను
హృషీకేశః = ఇంద్రియములకు ప్రభువగు కృష్ణుడు
ప్రహసన్ = నవ్వుచున్నవాని
ఇవ = వలె
భారత = ఓ ధృతరాష్ట్రా
సేనయోరుభయోః = ఇరుసేనల యొక్క
మధ్యే = నడుమ
విషీదన్తం = దుఃఖించుచున్న
ఇదం = ఈ క్రింది
వచః = వాక్యములు

తాత్పర్యం :-

భరతవంశమునకు చెందిన ఓ దృతరాష్ట్రుడా ఆ సమయమున నవ్వుచూ కృష్ణుడు రెండు సేనల నడుమ దుఃఖమద్ముడైన అర్జునునితో ఈ మాటలు చెప్పెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top