భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై రెండవ శ్లోకము

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ ||

వాసాంసి = వస్త్రములు
జీర్ణాని = ప్రాతబడి శిథిలములైనట్టివి
యథా = విధముగా
విహాయ = విడిచి
నవాని = నూతనవస్త్రములు
గృహ్ణాతి = గ్రహించునో
నరః = మానవుడు
అపరాణి = ఇతరములను
తథా = అట్లే
శరీరాణి = దేహములను
విహాయ = విడిచి
జీర్ణాని = ముసలివై నిష్ప్రయోజనమైన వానిని
అన్యాని = భిన్నములైన వానిని
సంయాతి = గ్రహించును
నవాని = క్రొత్తవానిని
దేహీ = దేహధారి

తాత్పర్యం :-

మానవుడు పాత వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు, ఆత్మ కూడా నిష్ప్రయోజనములైన దేహములను విడిచి నూతన దేహములను పొందుచున్నది.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top