భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై ఆరవ శ్లోకము

యావానర్థః ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||

యావాన్ = ఎంతటి
అర్థః = ప్రయోజనము
ఉదపానే = నూతి యందు
సర్వతః = అన్నివిధముల
సంప్లుతోదకే = పెద్ద జలాశయమునందు
తావాన్ = అట్లే
సర్వేషు = అన్ని
వేదేషు = వేదములందును
బ్రాహ్మణస్య = బ్రాహ్మణునికి
విజానతః = పరిపూర్ణజ్ఞానము గల

తాత్పర్యం :-

చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నియు పెద్ద తటాకమున ఏక కాలమునందే లబించును. అట్లే వేదముల యొక్క ప్రయోజములు వాని అంతరార్ధమును ఎరింగిన వానికి గ్రాహ్యమగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top