భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదమూడవ శ్లోకము

దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి ||

దేహినః = దేహధారి
అస్మిన్ = ఈ
యథా = ఎట్లు
దేహే = శరీరమునందు
కౌమారం = బాల్యము
యౌవనం = యౌవనము
జరా = ముసలితనము
తథా = అదే విధముగా
దేహాన్తరప్రాప్తిః = మరియొక దేహమును పొందుట
ధీరః = ధీరుడు
తత్ర = ఆ విషయమున
న ముహ్యతి = ఎన్నడును మోహము నొందడు

తాత్పర్యం :-

బద్ద జీవుడు అవిచ్చిన్నముగా ఈ దేహము నందు బాల్యము నుండి క్రమముగా యవ్వనమును ముసలి తనమునూ పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున ఇంకొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడేప్పుడునూ మొహమునొందడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top