భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదహారవ శ్లోకము

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టోఽన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః ||

అసతః = అసత్తునకు
న విద్యతే = లేదు
భావః = ఉనికి
అభావః = పరివర్తన స్వభావము
న విద్యతే = లేదు
సతః = నిత్యమైనదానికి
ఉభయోరపి = రెండింటి యొక్కయు
దృష్టః = దర్శింపబడినది
అన్తః = సారాంశము
తు = నిక్కముగా
అనయోః = వాటి
తత్త్వః = సత్యము
దర్శిభిః = తత్త్వదర్శులచే

తాత్పర్యం :-

సత్య ద్రష్టలైనవారు అసత్తు ఎడతెగక ఉండదనియు, శాశ్వతమైన దానికి మార్పు లేదనియు నిశయించిఉన్నారు. రెండింటి యొక్క తత్వమును బాగుగా పరిశిలించి వారీవిషయమును దృవీకరించియున్నారు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top