భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై ఏడవ శ్లోకము

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ||

కర్మణి = విధ్యుక్తధర్మములందు
ఏవ = నిశ్చయముగా
అధికారః = అధికారము
తే = నీకు
మా = ఎన్నడును
ఫలేషు = ఫలముల యందు
కదాచన = ఎప్పుడును
మా = లేదు
కర్మఫలహేతుః = కర్మఫలమునకు కారణము
మా భూః = కాకుము
తే = నీకు
సఙ్గః = ఆసక్తి
మా అస్తు = కలుగకుండుగాక
అకర్మణి = విధింపబడిన కర్మము మానుట యందు

తాత్పర్యం :-

వేదాదులచే విదింపబడిన కర్మను చేయుటకే నీకు అర్హత కలదు. కాని కర్మఫలముల యందు ఎట్టి అదికారమును లేదు. నీవే కర్మఫలములకు హేతువని ఎప్పుడునూ బావింపకుము. ధర్మమును నిర్వహింపకుండనుండుట యందు ఎప్పుడునూ ఆసక్తుడవు కాకుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top